రామవరం, ఏప్రిల్ 11 : కుల వివక్ష , అంటరానితనం వంటి సామాజిక దుష్టాలను నిర్మూలించడానికి కృషిచేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు అన్నారు. శుక్రవారం పూలే 198వ జయంతి వేడుకను ఆర్ సి ఓ ఏ క్లబ్లో ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం పూలే పోరాడారని, విద్యను, ప్రత్యేకంగా మహిళల విద్యను ప్రోత్సహించినట్లు తెలిపారు.
బీసీ నాయకులు మాట్లాడుతూ.. జ్యోతిరావు పూలే ఒక సామాజిక సంస్కర్త అన్నారు.సత్యశోధక్ సమాజ్ను స్థాపించి సామాజిక సమానత్వం కోసం పోరాడినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిసి & ఓబిసి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ లైజన్ ఆఫీసర్ ఎ.శ్రీధర్, బిసి & ఓబిసి అసోసియేషన్ బ్రాంచ్ సెక్రటరీ సకినాల సమ్మయ్య, ఏరియా సెక్రెటరీ వై.రవి, కొత్తగూడెం ఏరియా అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రెటరీ, ఏఐటీయూసీ జే.గట్టయ్య, వైస్ ప్రెసిడెంట్ ఐఎన్టియూసి, ఎండి.రజాక్, కొత్తగూడెం ఏరియా సిఎంఓఏఐ జనరల్ సెక్రెటరీ ఏ. ఉపేందర్, ఎస్ ఓ టు జిఎం జీవి కోటిరెడ్డి, ఎజిఎం (సివిల్) సి.హెచ్. రామకృష్ణ,ఎజిఎం (ఫైనాన్స్) కె.హన సమలత, ఏరియా ఇంజినీర్ కె.సూర్యనారాయణ రాజు, డిజిఎం(పర్సనల్) బి. శివకేశవరావు, డిజిఎం(ఐఈ) ఎన్.యోహన్, ఐటీ మేనేజర్ కె.శేషశ్రీ, ఇతర అధికారులు, అసోసియేషన్ సభ్యులు, ఉద్యోగులు, కార్మిక నాయకులు పాల్గొన్నారు.