రామవరం, మే 29 : కొత్తగూడెం ఏరియా ఎస్టీ ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన రోస్టర్ పాయింట్ రిజిస్టర్లను సింగరేణి ఎస్టీ కమిటీ చీఫ్ లైజన్ ఆఫీసర్ వి.కృష్ణయ్య గురువారం తనిఖీ చేశారు. కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ & జిఎం (ఓసిపి’ఎస్) కార్పొరేట్ ఎం. తిరుమల్ రావుతో కలిసి తనిఖీ చేసి రోస్టర్ రూల్ ప్రకారం పదోన్నతులు జరుగుతున్నాయా? లేదా? అని సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఏరియా డీజీఎం (పర్సనల్) బి.శివకేశవరావు వారికి వివరాలను వెల్లడించారు. రోస్టర్ రిజిస్టర్ పట్ల కృష్ణయ్య సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ బి.నాగేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ డి.పంతుల, డీడిజిఎం (ఐఈడి) ఎన్.మోహన్, ఏరియా ఎస్టేట్ ఆఫీసర్ బి. తౌర్య, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ జి.సంఘమిత్ర, ఏరియా లైజన్ అఫీసర్ బి. రామదాసు, ఏరియా ప్రెసిడెంట్ అజ్మీర శ్రీనివాస్, ఏరియా సెక్రెటరీ వి.హీరాలాల్, పర్సనల్ డిపార్ట్మెంట్ సిబ్బంది, జూనియర్ అసిస్టెంట్ డి.కిశోర్ కుమార్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.