పాల్వంచ, నవంబర్ 26 : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పాల్వంచలో బుధవారం ఘనంగా నిర్వహించారు. జాతీయ రహదారిలో గల అంబేద్కర్ విగ్రహానికి అఖిల భారత ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే పాల్వంచలోని కేటీపీఎస్ 5, 6 దశల కర్మాగారంలో ఎం సి ఆర్ హాల్లో సీఈ ప్రభాకర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హక్కుల పరిషత్ అఖిల భారత ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ సంఘం నాయకులు కాల్వ ప్రకాష్ రావు, కాల్వ దేవదాసు, భాస్కర్, ముండ్లపాటి రాజేందర్, కొత్తపల్లి సోమయ్య దండోరా శీను, గొడ్ల మోహన్ రావు, దేవదానం, దాసరి నాగేశ్వరరావు, కాల్వ రామారావు, కొప్పల వెంకటేశ్వర్లు, బిల్లా సుజిత్ ఎండి మంజూర్ ఆలీ ఖాన్, కేటీపీఎస్ ఎస్ఈలు శివారెడ్డి, సత్యనారాయణ, ధర్మారావు, కృష్ణ మోక్షవీరు, కిరణ్ వెల్ఫేర్ ఆఫీసర్ బాగా రాధాకృష్ణ పాల్గొన్నారు.