బూర్గంపహాడ్లో యధేచ్చగా ఇసుక అక్రమ రవాణా
బూర్గంపహాడ్ మండలంలో ఇసుక అక్రమ రవాణా యధేచ్ఛగా సాగుతోంది. మండల పరిధిలోని బుడ్డగూడెంతో పాటు సారపాక బ్రిడ్జి కింద అక్రమార్కులు ఇసుక రవాణాను జోరుగా సాగిస్తున్నారు. ఒక పక్క గోదావరి వరద వస్తున్నప్పటికీ పట్టపగలే ఈ అక్రమ రవాణాకు తెరలేపారు. గోదావరి, కిన్నెరసాని వాగు పరిధిలో..
– పట్టించుకోని అధికార యంత్రాంగం
బూర్గంపహాడ్, జూలై 14 : బూర్గంపహాడ్ మండలంలో ఇసుక అక్రమ రవాణా యధేచ్ఛగా సాగుతోంది. మండల పరిధిలోని బుడ్డగూడెంతో పాటు సారపాక బ్రిడ్జి కింద అక్రమార్కులు ఇసుక రవాణాను జోరుగా సాగిస్తున్నారు. ఒక పక్క గోదావరి వరద వస్తున్నప్పటికీ పట్టపగలే ఈ అక్రమ రవాణాకు తెరలేపారు. గోదావరి, కిన్నెరసాని వాగు పరిధిలో అక్రమార్కులు ట్రాక్టర్లలో ఇసుకను లోడ్ చేసి యధేచ్ఛగా వ్యాపారం సాగిస్తున్నా సంబంధిత రెవెన్యూ, పోలీసు యంత్రాంగం కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలు వినవస్తున్నాయి. అంతేకాకుండా అధికారిక ఇసుక ర్యాంపుల్లో అనధికారికంగా జీరో దందా నడుపుతున్నారన్న ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇసుకను చేతులతో లేదా పరిమితంగా తీయాల్సి ఉండగా ర్యాంపుల్లో భారీ యంత్రాలను ఏర్పాటు చేసి అనుమతులకు మించి లోతుతో ఇసుక తోడుతూ ఈ వ్యాపారం సాగిస్తున్నారు.
ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి పలుమార్లు మీడియా, సోషల్ మీడియాల్లో ప్రచురిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. అధికార పార్టీలో కొందరు తమ రాజకీయ పలుకుబడితో అక్రమ ఇసుక దందా కొనసాగిస్తున్నట్లు మండలంలో ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా మండలంలోని సారపాకతో పాటు బుడ్డగూడెంలో అక్రమ ఇసుక రవాణాపై సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు మండిపడుతున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

