సెయింట్ లూయిస్ చెస్ చాంప్ ప్రజ్ఞా
భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద సెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. గ్రాండ్ చెస్ టూర్ లో భాగంగా జరిగిన ఈ టోర్నీలో తొలిసారి టైటిల్ సొంతం చేసుకున్నాడు.
సెయింట్ లూయిస్ (యూఎస్ఏ): భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద సెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. గ్రాండ్ చెస్ టూర్ లో భాగంగా జరిగిన ఈ టోర్నీలో తొలిసారి టైటిల్ సొంతం చేసుకున్నాడు. మొత్తం 23.5 పాయింట్లతో ప్రజ్ఞానంద అగ్రస్థానం అందుకోగా.. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన జవోఖిర్ సిందరోవ్ 22 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచాడు. అమెరికా స్టార్ వెస్లీ సో 20.5 పాయింట్లతో మూడో స్థానం దక్కించుకున్నాడు. ర్యాపిడ్ విభాగాన్ని ఒక పాయింట్ ఆధిక్యంతో ముగించిన ప్రజ్ఞానంద, బ్లిట్జ్ లో ఒక్క గేమ్‌లో మాత్రమే ఓడిపోయి 18 పాయింట్లకు గాను 11.5 పాయింట్లు సాధించి తన ఆధిపత్యాన్ని చాటాడు. ఈ విజయంతో గ్రాండ్ చెస్ టూర్ ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో ప్రజ్ఞా రెండో స్థానానికి చేరి ఈ ఏడాది చివర్లో జరిగే ఫైనల్ బెర్తును దాదాపు ఖాయం చేసుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

