The Paradise | ‘ది పారడైజ్’కు సెన్సార్ షాక్.. 21 కట్స్‌తో ‘ఏ’ సర్టిఫికెట్, ఫైనల్ రన్‌టైమ్ ఇదే
The Paradise | నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన అత్యంత ఆసక్తికరమైన చిత్రం ‘ది పారడైజ్’. ‘దసరా’ తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళ సెన్సార్ ప్రక్రియకు సంబంధించిన తాజా సమాచారం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
The Paradise | నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన అత్యంత ఆసక్తికరమైన చిత్రం ‘ది పారడైజ్’. ‘దసరా’ తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళ సెన్సార్ ప్రక్రియకు సంబంధించిన తాజా సమాచారం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. అంతేకాకుండా సినిమాలోని పలు సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మొత్తం 21 మార్పులు, కట్స్ సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాలోని కొన్ని హింసాత్మక సన్నివేశాలు, తీవ్ర అభ్యంతరకరమైన పదజాలం, హీరో పాత్ర చేతిపై కనిపించే వివాదాస్పద టాటూపై సెన్సార్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
సెన్సార్ సూచనల మేరకు చిత్రబృందం కొన్ని హింసాత్మక సన్నివేశాలను కుదించడంతో పాటు, కొన్ని సంభాషణలను మ్యూట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే అవసరమైన హెచ్చరికలను కూడా సినిమాలో చేర్చినట్లు సమాచారం. ఈ మార్పుల అనంతరం ‘ది పారడైజ్’ తుది నిడివి 174 నిమిషాలుగా, అంటే 2 గంటల 54 నిమిషాలుగా ఖరారైంది. తొలుత ఈ సినిమా నిడివి 2 గంటల 49 నిమిషాలుగా ఉండేలా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రణాళిక రూపొందించారు. అయితే సెన్సార్ సూచించిన మార్పుల కారణంగా తుది నిడివిలో స్వల్ప మార్పు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.ఇక సెన్సార్ బోర్డు 21 కట్స్ సూచించినట్లు వస్తున్న వార్తలపై నాని అభిమానుల్లో చర్చ మొదలైంది. ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కలిసి చేస్తున్న చిత్రం కావడంతో ‘ది పారడైజ్’పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా రా యాక్షన్, బలమైన కథాంశం, నాని పాత్ర ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయని చిత్రబృందం ఇప్పటికే చెప్పుకొచ్చింది.
అణచివేతకు గురైన ఓ సమాజం తమ హక్కుల కోసం తిరుగుబాటు చేసే నేపథ్యంలో ఈ పీరియాడిక్ మాస్ డ్రామాను రూపొందించినట్లు సమాచారం. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. మరోవైపు ఎలాంటి అధికారిక ట్రైలర్ విడుదల చేయకుండానే టీజర్, పాటలతో సినిమాపై భారీ ఆసక్తిని పెంచడం ‘ది పారడైజ్’కు ప్రత్యేక ఆకర్షణగా మారింది. నాని కెరీర్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. తెలుగు, హిందీ, తమిళం సహా పలు భాషల్లో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలి హత్య
MLC Botsa | ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు..కేంద్రబలగాలను రప్పించాలి : ఎమ్మెల్సీ బొత్స
Delhi-NCR | ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం.. గ్రాప్-1 ఆంక్షలు అమలు
ఎక్కువ ఈఎంఐ కట్టడమా?.. కాల వ్యవది పెంచుకోవమా?.. ఆర్బీఐ వడ్డీరేటు పెంచిన తరువాత ఏది బెటర్
Trishula Snanarchana | వేయిస్తంభాల ప్రాచీనకోనేరులో త్రిశూలస్నానార్చన
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

