అసాన్ (దక్షిణ కొరియా): కొరియా మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లు అష్మిత చాలిహా, రక్షిత శ్రీ రామ్రాజ్ సెమీఫైనల్ చేరుకున్నారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 50వ ర్యాంకర్ అష్మిత 20-22, 21-15, 21-19తో టాప్ సీడ్, ప్రపంచ 22వ ర్యాంకర్ హీనా అకేచిని ఓడించి సంచలనం సృష్టించింది.మరో పోరులో రక్షిత 18-21, 21-19, 21-18 తేడాతో మూడో సీడ్, తోటి షట్లర్ తన్వి శర్మపై విజయం సాధించింది. సెమీఫైనల్లో అష్మిత, రక్షిత తలపడనున్నారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో కృష్ణ ప్రసాద్ – పృథ్వి కృష్ణమూర్తి రాయ్ 7-21, 8-21తో మలేషియా ద్వయం మ్యాన్ వియ్ చాంగ్ – సో వుయ్ యిక్ చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది.