న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: పండుగ ఖర్చులు అమాంతం పెరిగిపోతున్నాయి. ప్రస్తుత సంవత్సరంలో పండుగ సీజన్లో భారతీయులు తమ ఖర్చులు పెంచుకోవడానికి ఆసక్తి చూపేవారి సంఖ్య చాలా తక్కువ మంది ఉన్నట్టు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇన్మొబి అడ్వైర్టెజింగ్ తాజాగా విడుదల చేసన తన సర్వేలో ఈ పండుగ సీజన్లో రూ.50 వేలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టాలనుకునే వారు భారీగా పెరిగారు.
ఇదే సమయంలో రూ.10 వేల స్థాయిలో ఖర్చు పెట్టేవారిలో పెద్ద వృద్ధి నమోదుకాలేదు. మొత్తంమీద ఈ పండుగ సీజన్లో తమ ఖర్చులు పెంచుకునేవారు మాత్రం తగ్గుముఖం పట్టడం విశేషం. దేశవ్యాప్తంగా ఆగస్టు 7 నుంచి 11 వరకు 1,110 మంది పురుషులు, స్త్రీల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సర్వే సంస్థ ఈ నివేదికను రూపొందించింది.
ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 22 శాతం మంది రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు, రూ.50 వేలకు పైగా ఖర్చు చేద్దామనుకునే వారు 15 శాతం చొప్పున అధికమయ్యారు. సుమారు 60 శాతం మంది వినియోగదారులు పండుగలకు ఒక నెల ముందుగానే కొనుగోళ్లు చేయడానికి ప్రణాళికలు వేసుకుంటుండగా..29 శాతం మంది మాత్రం కేవలం వారం రోజుల ముందు షాపింగ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. 77 శాతం మందిదేశీయ వినియోగదారులు తమ పండుగ షాపింగ్ బడ్జెట్ను పెంచుకుంటున్నారు. ఐదుగురిలో ముగ్గురు పెట్టే ఖర్చు రూ.10 వేల కంటే అధికంగా ఖర్చుచేయాలని చూస్తున్నారు.