నాలుగు బాంబులతో మెస్సీని పేల్చేస్తా
అగ్రరాజ్యం అమెరికా విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చిన ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ లక్ష్యంగా ఉగ్ర బెదిరింపులు వచ్చినట్లు తాజాగా లీకైన పోలీసు నివేదికలు వెల్లడించాయి.
- ఫిఫా వరల్డ్‌కప్ సందర్భంగా ఉగ్ర బెదిరింపులు.. ఆలస్యంగా బహిర్గతం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చిన ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ లక్ష్యంగా ఉగ్ర బెదిరింపులు వచ్చినట్లు తాజాగా లీకైన పోలీసు నివేదికలు వెల్లడించాయి. జోర్డాన్‌తో మ్యాచ్‌కు ముందు అనామక ఫోన్ కాల్లో బాంబులు, తుపాకీతో స్టేడియంలోకి చొరబడి మెస్సీపై దాడి చేస్తామని బెదిరించినట్లు బయటపడింది. జూలై 7న అట్లాంటాలో ఈజిప్ట్‌తో జరిగిన మ్యాచ్ సమయంలో తన శరీరానికి నాలుగు బాంబులు కట్టుకుని వచ్చి మెస్సీని పేల్చేస్తానని ఒక వ్యక్తి ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో బాంబ్ డిస్పోజల్ బృందాలు మైదానాన్ని జల్లెడ పట్టాయి. టోర్నీలో మెస్సీనే కాకుండా పోర్చుగల్ లెజెండ్ రొనాల్డో, ఫ్రాన్స్ స్టార్ ఎంబాపెతో పాటు మ్యాచ్ రిఫరీలు కూడా బెదిరింపులను ఎదుర్కొన్నారు. రొనాల్డో బస చేసిన హోటల్లోకి అక్రమంగా చొరబడి అతడితో పాటు లిఫ్ట్ ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఫ్రాన్స్ రిఫరీ ఫ్రాంకోయిస్ లెటెక్సియర్‌కు ఏకంగా 6 వేలకు పైగా బెదిరింపు వాట్సాప్ మెసేజ్‌లు వచ్చాయి. వరల్డ్‌కప్ సాఫీగా ముగిసినా.. ఇలాంటి బెదిరింపుల వివరాలు బయటకు రావడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

