బూర్గంపహాడ్, మే 06 : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బూర్గంపహాడ్ తాసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి సబ్కా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెట్రో ధరలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయని అందులో భాగంగా ఈ నిరసన చేపట్టడం జరిగిందన్నారు. సామాన్యులపై మోయలేని భారాన్ని మోపుతుందని, ధరల పెంపుపై ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీ పోరాటాలకు సిద్ధమవుతుందన్నారు. ప్రభుత్వాలు ప్రజల హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించాలని, తక్షణమే పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి సామాన్యులకు ఊరటనివ్వాలని, లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డిప్యూటీ తాసీల్దార్ సమ్మయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు నల్లజాల సత్యనారాయణ, అలవాల సీతారాంరెడ్డి, సొల్లు పుల్లయ్య, సిద్ధారపు సుబ్బారెడ్డి, బర్ల వెంకటేశ్వర్లు, ముదిగొండ బాలకృష్ణ, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి కాటూరి రాము, కుంజా నాగరాజు, భూక్యా నాగేశ్వరరావు, బద్రి, సింగబోయిన వెంకటేశ్వర్లు, పెనుబల్లి మండల కార్యదర్శి సుధాకర్ పాల్గొన్నారు.