రామవరం, అక్టోబర్ 18 : పేద విద్యార్థులకు చేయూత అభినందనీయమని చుంచుపల్లి ఎంఈఓ బాలాజీ అన్నారు. గతేడాది పదో తరగతిలో మండలస్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు జమాతే ఇస్లామిక్ హింద్ రుద్రంపూర్ శాఖ ఆధ్వర్యంలో మోమొంట్స్ తో పాటు దుస్తులు, నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యుడు షేక్ అబ్దుల్ బాసిత్ దివంగత కుమార్తె సాదీయా పేరుతో మనవరాలు మన్హా షహరిష్ చేతుల మీదుగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామి హింద్ అధ్యక్షుడు రబ్బానీ, బహుమాన గ్రహీతలు సుహన, లక్ష్యా, దీక్షితా, సీపీఐ చుంచుపల్లి కార్యదర్శి తోట రాజు, గూడెల్లి యాకయ్య, మదార్, షమీం, ఉపాధ్యాయులు బాలు, రవి, లక్ష్మీ, వెంకటేశ్వరరావు, రాధ, రజీయ, గణేష్, ఇందిరా, కృష్ణవేణి, నిర్మల, చారి, ధీరజ్ పాల్గొన్నారు.
Ramavaram : పేద విద్యార్థులకు చేయూత అభినందనీయం : ఎంఈఓ బాలాజీ