హైదరాబాద్, మార్చి 14 (నమస్తేతెలంగాణ): గ్యాస్ సిలిండర్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. యుద్ధంతోపాటు కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతోనే సిలిండర్ ధరలు పెరిగాయని ఆరోపించారు.
ధరల పెరుగుదలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రం స్పందించి గ్యాస్ సరఫరాకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.