జూలూరుపాడు, జూలై 30 : వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు విష జ్వరాలు, అంటూ వ్యాధుల బారిన పడకుండా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ అన్నారు. బుధవారం ఆయన స్పందిస్తూ.. సంక్షేమ హాస్టల్స్లో శాశ్వత ఏఎన్ఎంను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. హాస్టల్స్ విద్యార్థులు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విష జరాల బారిన పడకుండా దోమ తెరలు పంపిణీ చేయాలని పేర్కొన్నారు.