కరకగూడెం, మే 26 : గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో, మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమం తీసుకుని మానవళి మనుగుడకు చెట్లే ప్రాణధారమని భావించి పలు విడతలలో నాటించిన మొక్కలు హరిత వనాలుగా మారి రహదారులకు నేస్తాలుగా మారాయి. కరకగూడెం మండలంలో ప్రధాన రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు వృక్షాలుగా మారాయి. దీంతో రహదారులు ఎక్కడ చూసిన చల్లని నీడతో దర్శనమిస్తున్నాయి. ద్విచక్రవాహనంపై వెళ్లే ప్రయాణీకులు, పాదాచారులు ఈ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. రహదారులకు ఇరువైపులా చెట్లు ఏపుగా పెరగడంతో పర్యావరణ పరిరక్షణతో పాటు వాహనదారులకు ప్రయాణం సురక్షితంగా, ఆహ్లాదంగా మారింది. స్వచ్ఛమైన ఆక్సిజన్ ను అందిస్తూ ఎండ వేళల్లో దూరం ప్రయాణించే వాహనదారులు, బాటసారులు కొంతసేపు హరితహారం చెట్ల కింద సేదతీరుతున్నారు. మూగజీవాలు సైతం ఎండకు తాళలేక చెట్ల కిందకు చేరుతున్నాయి. చేట్ల వల్ల ఉష్ణోగ్రత తక్కువగా ఉండి వాహనదారుల ప్రయాణం చల్లగా సాగుతుండటంతో ప్రతిఒక్కరూ హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కరకగూడెంలో చల్లదనం పంచుతున్న హరితహారం చెట్లు