న్యూఢిల్లీ : బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనేక విషయాలపై పార్టీ తరఫున స్పందిస్తున్న ఆయన.. టీవీ డిబేట్లు, ఇతర వేదికలపై తన వాయిస్‌ను వినిపించారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన రాజీనామా చేశారంటూ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఇటీవల పేపర్ లీకులకు వ్యతిరేకగా దేశ వ్యాప్తంగా జరిగిన నిరసనల నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేశారని అంటున్నారు. ఆయన రాజీనామా వార్తలకు ముందే తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి బీజేపీ పదాన్ని తొలగించారు. కానీ ఎందుకు రాజీనామా చేశారో మాత్రం చెప్పలేదు. 2017లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఆయన 2021 నుంచి బీజేపీ అధికార ప్రతినిధిగా కొనసాగుతూ వచ్చారు.