ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో (Yellandu) బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అజ్మీరా బావ్ సింగ్ నాయక్, దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో పట్టణంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో హరీశ్‌రావు పేరుపై ప్రత్యేక అర్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని, బీఆర్ఎస్ పార్టీకి విస్తృత సేవలు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం జగదాంబ సెంటర్లో తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యమ సీనియర్ నాయకులు సిలివేరి సత్యనారాయణ, 11వార్డు మాజీ కౌన్సిలర్ జేకే శ్రీను, టీబీజీకేఎస్ నాయకులు ఎస్ రంగనాథ్, ఇల్లందు పట్టణ ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబీ, మహమ్మద్ అబ్దుల్ జబ్బార్, గిన్నారపు రాజేష్, సాతల హరికృష్ణ, కాసాని హరిప్రసాద్ యాదవ్, మునిగంటి శివ, కడంగంచి వీరస్వామి, ఎస్కే చాంద్ పాషా, లలిత్ కుమార్ పాసి, రామ్ లాల్ పాసి, అజ్మీర నరేష్, గుగులోతు సోమన్న, భూక్య నందు, బోడ రమేష్, గుగులోత్ శ్రీనివాసు, మాలోత్ రాము, అజ్మీర రాందాస్, భూక్య శ్రీను, ధరావత్ రమేష్, నెమలి నిఖిల్, ములుగుండు ఉపేందర్, ఈదుల ముత్తయ్య, బజారు సత్యనారాయణ, వార రమేష్, ఎస్కే ఇమ్రాన్, పూర్ణాచారి, వీర బాబు, చిన్నారి తదితరులు పాల్గొన్నారు.