బూర్గంపహాడ్, మార్చి 28 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామ పంచాయతీలో ముస్లింల స్మశాన వాటిక వరకు సీసీ రోడ్డు, కబరస్తాన్ చుట్టూ ప్రహరీ నిర్మాణానికి ఐటీసీ సీఎస్ఆర్ నిధులు రూ.30 లక్షలతో చేపట్టే నిర్మాణ పనులకు సర్పంచ్ బానోత్ సరోజ శనివారం శంకుస్థాపన చేశారు. ముస్లింల ఇబ్బందులను గమనించి సీఎస్ఆర్ నిధులతో ఈ నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అప్పిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఐటీసీ మేనేజర్ విశ్వనాథం, బీఆర్ఎస్ నాయకులు బిజ్జం శ్రీనివాసరెడ్డి, దారం కృష్ణారెడ్డి, బిజ్జం వెంకట్రామిరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు మేడగం శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు బుస్కాని నరేశ్, ఇమడబత్తిన రామకృష్ణ, ఎడమకంటి పిచ్చిరెడ్డి, యారం వెంకట్రామిరెడ్డి, మొండెద్దుల వెంకటేశ్‌రెడ్డి, బానోత్ రామదాసు, మాజీ సర్పంచ్ బానోతు కృష్ణ, నాగిరెడ్డి, సానికొమ్ము రామచంద్రారెడ్డి, నరేశ్‌రెడ్డి, వెంకటరెడ్డి పాల్గొన్నారు.