కొత్తగూడెం: వేతనాల పెంపు కోసం గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె పదో రోజుకు చేరింది. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఆరు గ్రామ పంచాయతీల కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నాకు దిగారు. అధికారులు పట్టించుకొకపోవడంతో అఖిలపక్షం నాయకుల మద్దతుతో కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు.
మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో కార్మికులతోపాటు బీఆర్ఎస్ నాయకులు అన్వర్ పాషా, చిన్న, వినోద్, రజాక్, నవతన్, సీపీఎం, సీపీఐ నాయకులు, ఆదివాసీ నాయకుడు వాసం రామ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.