ఇల్లెందు, మే 02 : చేతికి వచ్చిన మొక్కజొన్న అగ్ని ప్రమాదంలో కాలి బూడిద కావడం నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ఇల్లెందు మండలం ఒడ్డుగూడెం గ్రామ పంచాయతీలో జరిగిన అగ్నిప్రమాదంలో మొక్కజొన్న పంటలు దగ్ధమై నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు చల్ల సముద్రం, గ్రామ సర్పంచ్ ఏపే శంకర్, ఉప సర్పంచ్ గుగ్గిళ్ల నరేష్, సహకార వ్యవసాయ సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బండారి శ్రీనివాస్‌లు మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంట చేతికొచ్చే సమయంలో అగ్నిప్రమాదంలో కాలిపోవడం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒడ్డుగూడెం గ్రామ పంచాయతీలో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే సహాయం అందించి, వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పూనెం లింగమ్మ, యువ నాయకులు భూక్య సురేష్, అయిలు నారాయణ గౌడ్, సోలం జనార్దన్, బానోత్ బనిషా, గుగ్గిళ్ల పవన్ పాల్గొన్నారు.