Yellandu : రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వాలు విఫలం : ఆవునూరి మధు
రాష్ట్రంలో రైతులకు యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవునూరి మధు అన్నారు.
ఇల్లెందు, జూలై 17 : రాష్ట్రంలో రైతులకు యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవునూరి మధు అన్నారు. గురువారం ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ యార్డులో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల గోదాం రైతుల పడుతున్న ఇబ్బందులపై వ్యవసాయ అనుబంధ సంఘం డి.ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. రైతులకు యూరియా వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇల్లెందు మండల పరిధిలో దాదాపు 34 వేల ఎకరాల్లో మొక్కజొన్న వేస్తారని దానికి సరిపడా యూరియా అందించాలని, మండల పరిధిలో కొమరారం, చల్ల సముద్రంలో ఎరువుల గోడౌన్ ఏర్పాటు చేయాలన్నారు.
రైతులకు ఎరువులను పూర్తిస్థాయిలో సరఫరా చేయకపోతే రాష్ట్రంలో జరిగే మంత్రుల పర్యటన కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం ఇల్లెందు పర్యటనకు వస్తున్న ఇద్దరు మంత్రులను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు మధు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ అనుబంధ వ్యవసాయ సంఘం నాయకులు దుబ్బాకుల ప్రసాద్, ఎట్టి నరసింహారావు పాల్గొన్నారు.

Yellandu : రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వాలు విఫలం : ఆవునూరి మధు
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
- Tags
- Aaunuri Madhu
- CPIML
- urea
- yellandu
RELATED ARTICLES
తాజా వార్తలు
నిరుద్యోగులకు ‘ప్రెసిడెన్షియల్’ షాక్.. 4 జిల్లాల్లో పోలీసు ఉద్యోగార్థుల కడుపుకొట్టిన కాంగ్రెస్!
Sai Pallavi | ఇకపై ఆచితూచి మాట్లాడతా.. వివాదాలపై సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు
Raaka | అల్లు అర్జున్ ‘రాకా’ షూటింగ్‌పై కీలక అప్డేట్.. దుబాయ్ షెడ్యూల్ హైదరాబాద్‌కు మార్పు!
Solar Pumpsets | వ్యవసాయానికి సోలార్ పంపుసెట్లు.. అధికారులకు రెడ్కో సీఎండీ కీలక ఆదేశాలు
Congress | రూ.6.91 కోట్ల సీఎంఆర్ ధాన్యం పక్కదారి.. కాంగ్రెస్ నేతపై చీటింగ్ కేసు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

