– బీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్
ఇల్లెందు, మార్చి 23 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని ఉమ్మడి ఖమ్మం బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ ఉన్నారు. సోమవారం ఇల్లెందు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు అన్యాయం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో చెప్పిన మాట ప్రకారం ప్రతి బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి బీసీలను మోసం చేసిందని దుయ్యబట్టారు. గత రెండు సంవత్సరాల్లో బీసీలకు కేటాయించిన బడ్జెట్లో 10 శాతం కూడా ఖర్చు పెట్టలేదన్నారు. రాష్ట్రంలో 58 శాతం మంది ఉన్న బీసీలకు, వారి సంక్షేమానికి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం చూస్తుంటే, మరొకసారి బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని అర్థమవుతుందన్నారు. బీసీల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందఅన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు ఎస్.రంగనాథ్, పట్టణాధ్యక్షుడు మహమ్మద్ జబ్బర్, పట్టణ ఉపాధ్యక్షుడు అబ్ధుల్ నబీ, కౌన్సిలర్లు జేకే శ్రీను, కటకం పద్మావతి, తోట లలిత, శారద, బీసీ నాయకులు పాల్గొన్నారు.