ఇస్లామాబాద్: భారత్లో జెన్-జీ ఉద్యమం సాధించిన విజయంతో స్ఫూర్తి చెంది.. తమను తాము ‘పాకిస్థాన్ కాక్రోచ్ పార్టీ’గా పేర్కొంటూ ఒక గ్రూప్ సామాజిక మాధ్యమంలో ఆవిర్భవించింది. అవినీతి, పేలవమైన పాలన, దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి తదితర సమస్యలపై పోరాటం సాగిస్తామని ప్రకటించింది.
ఆర్థిక, రాజకీయ స్థిరత్వం, నాణ్యమైన విద్య, దేశంలోని కరెంట్ కోతల నివారణ, నీటి ఎద్దడి సమస్యలపై దృష్టి సారించడమే తమ అజెండాగా ఆ గ్రూప్ పేర్కొంది. దీంతో ఆ గ్రూప్లో ఇప్పటికే 1,12,000 మందికి పైగా ఫాలోవర్లు చేరారు. ‘పాకిస్థాన్ దాని ప్రజలది, అవినీతి మాఫియాది కాదు’ అన్నది తమ నినాదమని ప్రకటించింది. ఐక్యత, మార్పు కోసం ఉద్యమంగా తమను తాము చాటుకుంది.