కార్తి కథానాయకుడిగా నటిస్తున్న తాజా స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్-2’ చిత్రం సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. పీఎస్ మిత్రన్ దర్శకుడు. మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఎస్.జె.సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నారు. శుక్రవారం టీజర్‌ను విడుదల చేశారు. ‘శాంతం..శాంతం..శాంతమే ప్రశాంతం..ఒక పొడుపు కథ చెబుతాను’ అంటూ ఎస్జే సూర్య వాయిస్‌తో ప్రారంభమైన టీజర్ ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగింది.
‘ఇద్దరు గూఢచారులు.. ఒకడు తండ్రి.. ఒకడు కొడుకు.. వాళ్ల టార్గెట్ నేనే. ఇప్పుడు గెలవబోయేది మంచి విలనా, చెడ్డ హీరోనా’ వంటి డైలాగ్‌లు హైలైట్‌గా నిలిచాయి. ఇందులో కార్తి డ్యూయల్ రోల్లో అదరగొట్టాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే వారికి ఇదొక విజువల్ ఫీస్ట్‌లా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సిఎస్, నిర్మాతలు: ఎస్.లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా, దర్శకత్వం: పిఎస్ మిత్రన్.