శ్రీనగర్, జూలై 31: జమ్ము కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక వలస కార్మికుడు మరణించగా, మరొకరు గాయపడ్డారు. కేలమ్ ప్రాంతంలోని ఒక ఇటుకబట్టీలో పనిచేస్తున్న వలస కార్మికులు లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరుపగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మార్గమధ్యంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్నారు. అనంత్‌నాగ్‌లో ఒక పోలీస్ అధికారిని ఉగ్రవాదులు కాల్చిచంపి 10 రోజులు కూడా కాకముందే మరో దాడికి తెగబడ్డారు. గాలింపులు కొనసాగుతున్నాయి.