‘ఇరుముడి’తో ఇటీవలే బ్లాక్‌బస్టర్ హిట్‌ను దక్కించుకున్నారు హీరో రవితేజ. ఈ విజయోత్సాహంలో ఆయన తదుపరి ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో హారర్ కామెడీ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసిన వివేక్ ఆత్రేయ త్వరలో చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘తులా భారం’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. దసరాకు ఈ సినిమాను ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.