AP News | దారుణం.. అప్పు చెల్లించలేదని తల్లిని, ఆరు నెలల బిడ్డను ఎత్తుకెళ్లిన వడ్డీ వ్యాపారి..!
AP News | తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదనే కారణంతో ఓ వడ్డీ వ్యాపారి.. మహిళను, ఆమె ఆరు నెలల పసిబిడ్డను ఎత్తుకపోయిండు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తొట్టంబేడు మండలం శివనాథపాలెం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన ఆ రాష్ట్రంలో రాజకీయ వివాదానికి దారితీసింది.
AP News : తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదనే కారణంతో ఓ వడ్డీ వ్యాపారి.. మహిళను, ఆమె ఆరు నెలల పసిబిడ్డను ఎత్తుకపోయిండు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తొట్టంబేడు మండలం శివనాథపాలెం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన ఆ రాష్ట్రంలో రాజకీయ వివాదానికి దారితీసింది. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఘటనపై పోలీసుల స్పందనను, టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రశ్నించింది.
బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. ఏడు నెలల క్రితం ఆది, అతని భార్య మేఘమాల శ్రీకాళహస్తికి చెందిన వెంకటగిరి మునెమ్మ, ప్రసాద్, మోహన్ అనే వ్యక్తుల దగ్గర రూ.1.50 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఈ అప్పు కోసం నెలకు నూటికి రూ.5 వడ్డీ చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే వారు అసలును, వడ్డీని సకాలంలో చెల్లించలేకపోయారు. దాంతో నవంబర్ 11న ఆది ఇంట్లో లేని సమయంలో ప్రసాద్, అతని కుమారుడు మోహన్ ఆది ఇంటికి వెళ్లారు.
వారికి బకాయిపడిన డబ్బు కోసం మేఘమాలను, ఆమె ఆరు నెలల పసిబిడ్డను తమతోపాటు తీసుకుపోయారు. దాంతో మేఘమాల కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల జోక్యంతో తల్లి, బిడ్డ సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చారు. శనివారం తొట్టంబేడు పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో శ్రీకాళహస్తి డీఎస్పీ పావని ఈ ఘటనపై స్పష్టత ఇచ్చారు. మేఘమాల ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదులో వడ్డీ చెల్లించాలని ఒత్తిడి చేసినట్లు పేర్కొన్నారే తప్ప, తమను బలవంతంగా తీసుకెళ్లారని లేదా బంధించారని ఎక్కడా పేర్కొనలేదని తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు స్టేషన్ నోటీస్ జారీచేసి కేసు నమోదు చేయడానికి స్థానిక కోర్టు నుంచి అనుమతి కోరారని డీఎస్పీ తెలిపారు. నవంబర్ 13న తొట్టంబేడు సబ్-ఇన్స్పెక్టర్ జారీ చేసిన నోటీసులో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 174 కింద విచారణ చేపట్టనున్నట్లు కూడా పేర్కొన్నారు. కోర్టు అనుమతి లభిస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. దాడికి పాల్పడినట్లు వచ్చిన మరో ఫిర్యాదుపై కూడా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పావని తెలిపారు.
ఇదిలావుంటే.. ప్రజలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ ఆరోపించింది. నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. డబ్బు వసూలు చేయడానికి పసికందును ఇంటి నుంచి తీసుకెళ్లడం ఏమిటని, దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఆ పార్టీ ప్రశ్నించింది. జవాబుదారీతనం ఉండాలని, బలవంతపు రుణ వసూళ్లను నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | దారుణం.. అప్పు చెల్లించలేదని తల్లిని, ఆరు నెలల బిడ్డను ఎత్తుకెళ్లిన వడ్డీ వ్యాపారి..!
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Madurai Tanishq Heist: మధురై తనిష్క్ చోరీలో కేసులో ప్రధాన నిందితుడు నిషాంత్ అరెస్టు
Alprazolam | బిజినేపల్లిలో అక్రమ అల్ప్రాజోలం తయారీ కేంద్రం గుట్టురట్టు
NIMS Staff | మాకు పెన్షన్ ఇవ్వడమే రూ.100 కోట్ల స్కామా..? : కవిత ఆరోపణలపై నిమ్స్ ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి

