Amitabh Bachchan | ‘బతికి బయటపడ్డాం’.. అమితాబ్ బచ్చన్ సంచలన పోస్ట్,అసలేం జరిగింది?
Amitabh Bachchan | బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో చేసిన ఓ చిన్న పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఆదివారం అర్ధరాత్రి ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ‘బతికి బయటపడ్డాం’ అంటూ రెండు పదాలతో చేసిన వ్యాఖ్య అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
Amitabh Bachchan | బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో చేసిన ఓ చిన్న పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఆదివారం అర్ధరాత్రి ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ‘బతికి బయటపడ్డాం’ అంటూ రెండు పదాలతో చేసిన వ్యాఖ్య అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. అసలు అమితాబ్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? ఆయనకు ఏదైనా ప్రమాదం ఎదురైందా? అనే సందేహాలు నెటిజన్లలో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల ఆయన నివాసం జల్సాను లక్ష్యంగా చేసుకుని దాడికి కుట్ర జరిగినట్లు వార్తలు రావడంతో ఈ పోస్టుకు ప్రాధాన్యం ఏర్పడింది.
అమితాబ్ బచ్చన్ ఆదివారం అర్ధరాత్రి తన ఎక్స్ ఖాతాలో ‘బతికి బయటపడ్డాం’ అంటూ పోస్ట్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశారనే విషయాన్ని ఆయన స్పష్టంగా వెల్లడించలేదు. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ పోస్టు వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా తన వ్యక్తిగత అనుభవాలు, సినిమా విశేషాలు, ఆలోచనలను సోషల్ మీడియా ద్వారా పంచుకునే అమితాబ్.. ఈసారి చేసిన సంక్షిప్త వ్యాఖ్య మాత్రం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అమితాబ్ బచ్చన్ నివాసం ‘జల్సా’ వద్ద కాల్పులు జరిపేందుకు కొందరు వ్యక్తులు కుట్ర పన్నినట్లు దిల్లీ పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు కథనాలు పేర్కొంటున్నాయి. ఈ కుట్ర వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు అనుమానిత షూటర్లను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.
అయితే అమితాబ్ చేసిన ‘బతికి బయటపడ్డాం’ అనే వ్యాఖ్యకు ఈ కుట్రతో సంబంధం ఉందా? లేక మరేదైనా సందర్భంలో ఆయన ఆ మాటలు అన్నారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే, గత నెల రోజుల్లో అమితాబ్ నివాసమైన జల్సాకు మూడుసార్లు బాంబు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. అక్టోబర్ 23, నవంబర్ 6, నవంబర్ 12 తేదీల్లో ఈ-మెయిల్స్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. వరుసగా బెదిరింపులు రావడంతో ముంబయి పోలీసులు అప్రమత్తమయ్యారు. అమితాబ్ నివాసం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అదనపు పోలీసు బలగాలను మోహరించడంతో పాటు, ఇంటి పరిసరాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా పెంచారు. కాగా, ఇటీవల బాలీవుడ్ నటీనటులకు బెదిరింపులు రావడం, ప్రముఖుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని కుట్రలు జరుగుతున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ చేసిన తాజా పోస్ట్ మరింత చర్చకు కారణమైంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | ‘బతికి బయటపడ్డాం’.. అమితాబ్ బచ్చన్ సంచలన పోస్ట్,అసలేం జరిగింది?
AP News | దారుణం.. అప్పు చెల్లించలేదని తల్లిని, ఆరు నెలల బిడ్డను ఎత్తుకెళ్లిన వడ్డీ వ్యాపారి..!
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Madurai Tanishq Heist: మధురై తనిష్క్ చోరీలో కేసులో ప్రధాన నిందితుడు నిషాంత్ అరెస్టు
Alprazolam | బిజినేపల్లిలో అక్రమ అల్ప్రాజోలం తయారీ కేంద్రం గుట్టురట్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి

