Madurai Tanishq Heist: మధురై తనిష్క్ చోరీలో కేసులో ప్రధాన నిందితుడు నిషాంత్ అరెస్టు
Madurai Tanishq Heist: 21 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను మధురైలోని తనిష్క్ షోరూమ్‌లో ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఆ చోరీ కేసులో ప్రధాన నిందితుడు నిషాంత్‌ను అరెస్టు చేశారు. ధర్మపురిలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
చెన్నై: తమిళనాడు మధురైలోని తనిష్క్ షోరూమ్‌లో నగలు చోరీ(Madurai Tanishq Heist) జరిగిన విషయం తెలిసిందే. ఆ షోరూమ్ నుంచి 21 కోట్ల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్తారు. నవంబర్ 12వ తేదీన జరిగిన ఈ ఘటనలో ప్రధాన నిందితుడు 25 ఏళ్ల నిషాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ధర్మపురిలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బెంగుళూరు నుంచి సేలం వెళ్తున్న ఓమ్నీబస్సు డ్రైవర్ నిందితుడు నిషాంత్‌ను గుర్తుపట్టి, పోలీసులకు సమాచారాన్ని చేరవేశాడు. అధియమన్కొట్టిఐ పోలీసులు సీసంపత్తి బైపాస్ వద్ద బస్సును అడ్డగించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బస్సు కిటికీ నుంచి అతను పారిపోయే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు అతన్ని చుట్టుముట్టేశారు. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక బృందానికి సమాచారాన్ని చేరవేయడంతో మధురై నుంచి ప్రత్యేక బృందం ధర్మపురి చేరుకున్నది.
నిషాంత్‌ను పట్టుకోవడానికి ముందే.. షోరూమ్ నుంచి ఎత్తుకెళ్లిన కొంత ఆభరణాలను సీజ్ చేశారు. ఈ కేసులో నిషాంత్ తండ్రి, అతని ప్రేయసి మీనాక్షిని అదుపులోకి తీసుకున్నారు.నవంబర్ 14వ తేదీన ఆ ఇద్దర్నీ అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు ఆరు కిలోల బంగారు, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మాడకుళం ట్యాంక్ సమీపంలో ఉన్న ఓ వ్యవసాయ భూమిలో ఆ నగలను పాతిపెట్టారు. నవంబర్ 29 వరకు ఆ ఇద్దర్నీ రిమాండ్‌లోకి తీసుకున్నారు. ఈ చోరీ కేసులో నిషాంత్ మాస్టర్ మైండ్ అని పోలీసులు ప్రకటించారు. సురేశ్, మీనాక్షీ ఈ చోరీలో హెల్ప్ చేశారు.
పలంగనాథమ్ రోడ్డులో ఉన్న షోరూమ్ నుంచి నిషాంత్ సుమారు 15 కేజీల బంగారం, డైమండ్ జ్వలరీని దొంగలించాడు. త్రిపురకుండ్రంలోని ఓ బ్రిడ్జ్ వద్దకు తండ్రిని రమ్మని ఆ ఆభరణాలను అతనికి అప్పగించినట్లు పోలీసులు చెప్పారు. ఆ తర్వాత పలంగనాథమ్లో ఉన్న ఇంటికి నిషాంత్ వెళ్లాడు. జ్వలరీని దాచేందుకు మీనాక్షీ కూడా వెళ్లింది. తర్వాత రోజున తండ్రి ఆటో తీసుకుని ఓ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. అక్కడ దుస్తులకు నిప్పు పెట్టి, ఆభరణాలను మాత్రం భూమిలో దాచాడు. ఆ విలువైన ఆభరణాలు ఎక్కడ ఉన్నాయో మీనాక్షీకి అతను చెప్పాడు. ఆ తర్వాత మధురై నుంచి నిషాంత్ పరారీ అయ్యాడు.
ఈ క్రైంలో వాడిన స్కూటీ .. మీనాక్షీది. తిరుప్పలైలో మీనాక్షీ ఇళ్లు నిర్మిస్తోంది. అయితే ఆమెకు సాయం చేసేందుకు నిషాంత్ చోరీ చేసినట్లు తెలిసింది. ఈ ఘటనకు ముందు.. నిషాంత్, మీనాక్షీలు ఓ యూట్యూబ్‌ఛానల్ నడిపారు. మధురైలోని ఆర్ట్స్ కాలేజీలో ఇద్దరూ చదువుకున్నారు. ఓ స్థానిక యూట్యూబ్ ఛానల్లో ఫ్రీలాన్స్ ఎడిటర్‌గా నిషాంత్ వర్క్ చేశాడు. ఆ తర్వాత మీనాక్షికి అక్కడ జాబ్ ఇప్పించాడు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల వేళ ఓ రాజకీయ పార్టీ తరపున మీనాక్షీ ప్రచారం చేసింది.
చోరీకి ముందు నిషాంత్ రెండు సార్లు షోరూమ్‌కు వెళ్లి రెక్కీ గీసినట్లు పోలీసులు తెలిపారు. మెయింటేనెన్స్ లిఫ్ట్ ద్వారా షోరూమ్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను తెలుసుకున్నాడు. సీసీటీవీ ఫూటేజ్‌లో టట్టూ ధరించిన వ్యక్తి దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. షోరూమ్ సిబ్బందికి ఆ ఫూటేజ్ చూపించారు. ఓ వ్యక్తి నిషాంత్‌ను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madurai Tanishq Heist: మధురై తనిష్క్ చోరీలో కేసులో ప్రధాన నిందితుడు నిషాంత్ అరెస్టు
Alprazolam | బిజినేపల్లిలో అక్రమ అల్ప్రాజోలం తయారీ కేంద్రం గుట్టురట్టు
NIMS Staff | మాకు పెన్షన్ ఇవ్వడమే రూ.100 కోట్ల స్కామా..? : కవిత ఆరోపణలపై నిమ్స్ ఉద్యోగులు
కొమిరిశెట్టి దివ్యకు ఎంజీయూ డాక్టరేట్
Aadhav Arjuna: టీవీకే మంత్రి ఆధవ్ అర్జునతో విడిపోయినట్లు ప్రకటించిన డైసీ మార్టిన్
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

