Aadhav Arjuna: టీవీకే మంత్రి ఆధవ్ అర్జునతో విడిపోయినట్లు ప్రకటించిన డైసీ మార్టిన్
Aadhav Arjuna: తమిళనాడు మంత్రి , తమిళగ వెట్రి కజగం నేత ఆధవ్ అర్జున, ఆయన భార్య డైసీ మార్టిన్ విడిపోయారు. ఆ ఇద్దరూ పరస్పర అంగీకారంతో 14 ఏళ్ల వివాహ బంధానికి బ్రేక్ చెప్పారు. డైసీ మార్టిన్ ఈ విషయాన్ని తన ఇన్‌స్టా పోస్టులో కన్ఫర్మ్ చేశారు.
చెన్నై: తమిళనాడు మంత్రి , తమిళగ వెట్రి కజగం నేత ఆధవ అర్జున(Aadhav Arjuna), ఆయన భార్య డైసీ మార్టిన్ విడిపోయారు. ఆ ఇద్దరూ పరస్పర అంగీకారంతో 14 ఏళ్ల వివాహ బంధానికి బ్రేక్ చెప్పారు. ఈ విషయాన్ని డైసీ మార్టిన్ తన ఇన్‌స్టా పోస్టులో కన్ఫర్మ్ చేశారు. 14 ఏళ్లగా కలిసి జీవించామని, ప్రేమతో ఆ జర్నీ నిండి ఉందని, స్నేహితులుగా.. జీవితభాగస్వాములుగా, పేరెంట్స్‌గా కలిసి ఉన్నామని, అయితే ఇప్పుడు ఆధవ అర్జున, నేను పరస్పర అంగీకారంతో వేరుపడుతున్నామని డైసీ తన ఇన్‌స్టాలో పేర్కొన్నది. అయితే విడాకులు తీసుకున్న అంశంపై మాత్రం అధికారిక ప్రకటన ఇంకా జరగలేదు.
ఆధవ్ అర్జునను గౌరవిస్తానని, అతనికి సంతోషం, శాంతి, విజయం లభించాలని కాంక్షిస్తున్నట్లు డైసీ తన ప్రకటనలో తెలిపారు. తమ ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నట్లు అభిమానులకు ఆమె చెప్పారు. ఆధవ్ అర్జున తొలుత విదుతలై చిరుతైగల్ కచ్చి పార్టీలో ఉన్నారు. అయితే గత ఎన్నికల సమయంలో ఆయన విజయ్ పార్టీ టీవీకేలో చేరారు. ఆధవ్ అర్జున భార్య డైసీ.. ల్యాటరీ బారన్ శాంటియాగో మార్టిన్ కుమార్తె.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadhav Arjuna: టీవీకే మంత్రి ఆధవ్ అర్జునతో విడిపోయినట్లు ప్రకటించిన డైసీ మార్టిన్
Tirumala | శ్రవణా నక్షత్రం సందర్భంగా తిరుమలలో వైభవంగా పుష్పాల ఊరేగింపు
కారేపల్లిలో ప్రజావాణిపై అధికారుల నిర్లక్ష్యం
‘కోయగూడెం ఓసీ-3ను సింగరేణి సంస్థ ద్వారానే నిర్వహించాలి’
Bilkis Bano case | బిల్కిస్ బానో కేసులో ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్..!
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

