పోక్సో చట్టం, బాలల హక్కులపై విద్యార్థినులకు అవగాహన
బాల బాలికల రక్షణకు ప్రభుత్వం కల్పించిన చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పారా లీగల్ వాలంటీర్ నరసింగం చరణ్ కుమార్ అన్నారు. సోమవారం టేకులపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల పాఠశాల, కళాశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు...
టేకులపల్లి, నవంబర్ 16 : బాల బాలికల రక్షణకు ప్రభుత్వం కల్పించిన చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పారా లీగల్ వాలంటీర్ నరసింగం చరణ్ కుమార్ అన్నారు. సోమవారం టేకులపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల పాఠశాల, కళాశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సురక్షిత్ బచ్పన్ అభియాన్ ఫేజ్-2 కార్యక్రమంలో భాగంగా బాలల చట్టాలు, పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చరణ్ కుమార్ మాట్లాడుతూ… బాలికల రక్షణకు గర్భస్థ దశ నుండే చట్టాలు వర్తిస్తాయని వివరించారు. 18 ఏళ్లలోపు బాలికలు ఎదుర్కొంటున్న అక్రమాలు, వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి ఘటనలు ఎదురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చట్టపరమైన రక్షణ చర్యలను వివరించారు. చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుమారు 270 మంది విద్యార్థినులు పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. స్పెషల్ ఆఫీసర్, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పోక్సో చట్టం, బాలల హక్కులపై విద్యార్థినులకు అవగాహన
‘కేఓసీ హెచ్డీ ఓబీలో పాత కార్మికులకే ఉపాధి కల్పించాలి’
Amitabh Bachchan | ‘బతికి బయటపడ్డాం’.. అమితాబ్ బచ్చన్ సంచలన పోస్ట్,అసలేం జరిగింది?
AP News | దారుణం.. అప్పు చెల్లించలేదని తల్లిని, ఆరు నెలల బిడ్డను ఎత్తుకెళ్లిన వడ్డీ వ్యాపారి..!
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి

