న్యూఢిల్లీ: ఇటీవల జంతర్ మంతర్లో తమ పార్టీ ఆధ్వర్యంలో నిరసనల సందర్భంగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక యువతిపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) శుక్రవారం తీవ్రంగా విమర్శించింది. బాధిత పక్షాలు క్రిమినల్ న్యాయ వ్యవస్థను ఆశ్రయించడానికి బదులుగా పరువు నష్టం దావా వంటి చర్యలను చేపట్టాలని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ సూచించారు.
రుచికా సింగ్ అనే యువతిపై నమోదైన ఎఫ్ఐఆర్ పట్ల స్పందిస్తూ అభ్యంతరకర లేదా అవమానకర భాషను సహించకూడదని, అయితే అటువంటి వ్యాఖ్యలపై క్రిమినల్ విచారణ జరపడం భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తుందని సౌరవ్ అన్నారు. బీజేపీకి చెందిన దాదాపు 100 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, పోలీసులు వారిపై దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు.