న్యూఢిల్లీ, అక్టోబర్ 2: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్..వినూత్న ప్లాన్ను ఆవిష్కరించింది. ఎంపిక చేసిన ప్లాన్లపై ఉచిత ప్రమాద బీమా ఆఫర్ను అందిస్తున్నట్టు ప్రకటించింది. వీటిలో ఎస్టీవీ 202, ఎస్టీవీ 2449 ప్లాన్లపై లక్ష రూపాయల వరకు ప్రమాద బీమీ, సైబర్ మోసాలపై రూ.10 వేల వరకు బీమా అవకాశాన్ని కల్పిస్తున్నది. వినియోగదారుల భద్రతకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో సంస్థ ఈ బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కంపెనీ సీఎండీ రాబర్ట్ జే రవి తెలిపారు.
ఇలాంటి నూతన ఆఫర్ ఇస్తున్న తొలి సంస్థ మాదే అనుకుంటానని, గతంలో ఎయిర్టెల్ ఆఫర్ ఇచ్చినట్టు గుర్తు అని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ప్లాన్లతో రైతులకు, వ్యవసాయ కార్మికులు, చేపలుపట్టేవారికి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఒక్కో వినియోగదారుడిపై సంస్థకు వస్తున్న ఆదాయం రూ.101కి పెరిగింది. అంతక్రితం ఇది రూ.71గా ఉన్నది. భారతీ ఎయిర్టెల్ మాత్రం రూ.179, రూ.270 ప్లాన్లపై లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను ఇచ్చింది.