Weak Monsoon | బలహీన రుతుపవనాలతో భారత్ విలవిల.. రైతుల నుంచి వ్యాపారుల వరకూ డీలా
Weak Monsoon | భారతదేశంలో ఈ ఏడాది రుతుపవనాలు అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపించాయి. జూన్-సెప్టెంబర్ మధ్య దేశవ్యాప్తంగా నమోదైన వర్షపాతం దీర్ఘకాల సగటుకంటే 12.6 శాతం తక్కువగా ఉంది. 2015 తర్వాత ఇదే అత్యంత బలహీన రుతుపవనంగా నిలిచింది.
Weak Monsoon | హైదరాబాద్, (నమస్తే తెలంగాణ, అక్టోబర్ 2)/న్యూఢిల్లీ : భారతదేశంలో ఈ ఏడాది రుతుపవనాలు అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపించాయి. జూన్-సెప్టెంబర్ మధ్య దేశవ్యాప్తంగా నమోదైన వర్షపాతం దీర్ఘకాల సగటుకంటే 12.6 శాతం తక్కువగా ఉంది. 2015 తర్వాత ఇదే అత్యంత బలహీన రుతుపవనంగా నిలిచింది. అత్యల్ప, అస్తవ్యస్త వర్షాలు రైతుల ఆదాయంతో పాటు అన్ని రంగాలపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. హర్యానాలోని కర్నాల్, ఘరౌండా ప్రాంతాల్లో రైతులు వరి పంటను మార్కెట్లకు తీసుకువస్తున్నారు.
అయితే ఈ సారి దిగుబడులు తగ్గడంతోపాటు, పురుగుమందులు, ఎరువులు, డీజిల్, వ్యవసాయ పరికరాల నిర్వహణ ఖర్చులు పెరిగాయి. పంట ఆదాయం తగ్గడంతో రైతులు ట్రాక్టర్లు, బంగారం, గృహోపకరణాల వంటి పెద్ద కొనుగోళ్లను వాయిదా వేసే పరిస్థితి ఏర్పడింది. ఘరౌండాలో ఫ్రిడ్జ్‌లు, టీవీలు, వాషింగ్ మెషీన్లు విక్రయించే సత్పాల్ ఈ సెప్టెంబర్ తొలి మూడు వారాల్లో కేవలం ఆరు యూనిట్లు మాత్రమే విక్రయించానని తెలిపారు. ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం ట్రాక్టర్ అమ్మకాల వార్షిక వృద్ధి ఆగస్టులో 0.8 శాతానికి పడిపోయింది.
మార్చి 2027 వరకు ఎల్ నినో ప్రభావం?
ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం బలంగా ఉందని వాతావరణ శాఖ చీఫ్ మృత్యుంజయ్ పేరొన్నారు. నవంబర్ చివరి వరకు బలంగా కొనసాగి, ఆ తర్వాత క్రమంగా తగ్గే అవకాశం ఉందన్నారు. అయితే దాని ప్రభావాలు 2027 మార్చి వరకు కొనసాగవచ్చని వివరించారు. ప్రస్తుతం ఎల్ నినో తటస్థ స్థితికి దగ్గరగా ఉన్నప్పటికీ, రాబోయే నెలల్లో పాజిటివ్ దశకు మారే అవకాశం ఉందని అంచనా వేశారు. తుపానులు దక్షిణ దిశగా ఏర్పడే అవకాశాల నేపథ్యంలో దక్షిణ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ప్రాంతాలపై వాటి ప్రభావం తకువగా ఉండవచ్చని మహాపాత్ర తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
మరణంలోనూ మహాదానం.. 8 మందికి ప్రాణం పోసిన టీచర్ నీరజారెడ్డి
Mission bhagiratha water | అధికారులూ 4 రోజులవుతుంది పట్టించుకోరా..? వృథాగా పోతున్న మిషన్‌భగీరథ నీరు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

