MSP | క్వింటాల్‌కు రూ.25 పెంపా.. ఇదేం మద్దతు ధర.. కేంద్రంపై రైతు సంఘాల ఆగ్రహం
MSP | కొన్ని వ్యవసాయ పంటలకు కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరపై రైతు సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. గోధుమలకు కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ. 25 పెంచడాన్ని తీవ్రంగా నిరసించాయి.
MSP | న్యూఢిల్లీ: కొన్ని వ్యవసాయ పంటలకు కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరపై రైతు సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. గోధుమలకు కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ. 25 పెంచడాన్ని తీవ్రంగా నిరసించాయి. పంటల ప్రస్తుత ఉత్పత్తి వ్యయానికి, ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు ఏమాత్రం పొంతనలేదని పేర్కొన్నాయి. రైతులకు లాభదాయకమైన రాబడులను చేకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం కనీస మద్దతు ధరను నిర్ణయిస్తున్నట్టు ప్రకటించడాన్ని వారు ప్రస్తావిస్తూ ఈ పెంపు పెరిగిన సాగువ్యయాల పెరుగుదలను తగినంతగా ప్రతిబింబిస్తున్నదా? అని ప్రశ్నించాయి.
ప్రతి పంటకూ కనీస మద్దతు ధర నిర్ణయించేటప్పుడు అసాధారణంగా పెరుగుతున్న సాగు ఖర్చు, ద్రవ్యోల్బణానికి సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ఒక పక్క కలుపు సంహారక, క్రిమిసంహారక ముందుల ధరలు ఒకటిన్నర రెట్లు పెరిగాయని, మరో పక్క డీజిల్ ధరలు కూడా భారమయ్యాయని, ఇవేమీ పరిగణనలోకి తీసుకోకుండా గోధుమల కనీస మద్దతు ధరను రూ.25 పెంచుతూ క్వింటాల్‌కు రూ.2,610 గా నిర్ణయించడాన్ని భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ ప్రతినిధి ధర్మేంద్ర మాలిక్ తీవ్రంగా విమర్శించారు.
మద్దతు ధరను 0.96 శాతం పెంచడం రైతులను మోసగించడమేనని అన్నారు. నిత్యం పెరుగుతున్న సాగు పెట్టుబడులు, ఆహార ధరలు, గృహ జీవన వ్యయాలను పరిగణనలోకి తీసుకుని కనీస మద్దతు ధరను నిర్ణయించాలని సంయుక్త కిసాన్ మోర్చా సమన్వయ కమిటీ సభ్యుడు పి కృష్ణప్రసాద్ డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- agriculture
- crop prices
- farmers
- msp
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
Gopi Chand | వరుస పాన్ ఇండియా సినిమాలతో గోపీచంద్ కమ్‌బ్యాక్.. రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు!
Cyclone Arnab | ఏపీ తీరానికి అర్నబ్ తుపాను ముప్పు.. తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

