– మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత
– బాకీ కార్డులు ప్రదర్శించి బీఆర్ఎస్ శ్రేణుల నిరసన
బూర్గంపహాడ్, సెప్టెంబరు 4 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన 420 హామీలు 1000 రోజుల పాటు సాగిన పాలన అంతా దగా అని మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత అన్నారు. శుక్రవారం 1000 రోజుల కాంగ్రెస్ పాలన వైఫల్యాలకు నిరసనగా మహిళలకు ఇచ్చిన హామీలు విస్మరించిన ప్రభుత్వంపై బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బూర్గంపహాడ్ మండల పరిధిలోని లక్ష్మీపురం మాజీ జడ్పీటీసీ క్యాంపు కార్యాలయం వద్ద బాకీ కార్డులు ప్రదర్శించి పెద్ద ఎత్తున నిరసన నిర్వహించారు. మహిళలకు నెలకు రూ.2500, వృద్ధులకు, బీడీ కార్మికులకు పింఛన్ రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, కల్యాణలక్ష్మి, షాధీముబారక్ ఆడబిడ్డ పెళ్ళిళ్లకు తులం బంగారం, విద్యార్ధినులకు స్కూటీలు, ఫీజు రీయింబర్స్మెంట్ ఫీజు బకాయి రూ.12 వేల కోట్లు బాకీ ఉన్నాయని బాకీ కార్డులను ప్రదర్శించి ప్రభుత్వ వైఫల్యంపై నిరసన తెలిపారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇలా అలివిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 1000 రోజులైనా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా బాకీ పెట్టిందని, ఆ హామీలను తక్షణమే అమలు చేయాలని లేనిపక్షంలో బీఆర్ఎస్ ఉద్యమపోరుబాటకు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, పట్టణ అధ్యక్షుడు కొనకంచి శ్రీనివాసరావు, మండల నాయకులు మేడిగం లక్ష్మినారాయణ, పొడియం నరేంద్ర, సానికొమ్ము శంకర్‌రెడ్డి, పాలెం దివాకర్‌రెడ్డి, పోతిరెడ్డి గోవిందరెడ్డి, గోనెల నాని, పూర్ణ, సోము లక్ష్మిచైతన్యరెడ్డి, బెజ్జంకి కనకాచారి, తిరుపతి ఏసోబు, గుల్మహ్మద్, సాలయ్య, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల బాధ్యులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.

‘మహిళా సమస్యలు గాలికొదిలేసిన ప్రభుత్వం’