రామవరం, ఏప్రిల్ 07 : ఆరోగ్యమే మహాభాగ్యం కావునా ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్య అలవాట్లను అలవర్చుకోవాలని కొత్తగూడెం ఏరియా జీఎం ఎం.షాలేం రాజు అన్నారు. అలాగే వ్యాయామం తప్పనిసరిగా దినచర్యలో భాగం చేసుకోవాలన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సింగరేణి మెడికల్ & హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్ డిస్పెన్సరీ మెడికల్ ఆఫీసర్ ఎం. పరశురాములు సమక్షంలో జిఎం కార్యాలయ సిబ్బందికి డాక్టర్ డి.లలిత, హెల్త్ ఆఫీసర్, మెయిన్ హాస్పిటల్ వైద్యులచే అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ డి.లలిత మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఆరోగ్యకరమైన ప్రారంభం, ఆశాజనక భవిష్యత్ అన్నారు. అనగా తల్లి, నవజాత శిశువుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని.
మహిళా ఉద్యోగులు ప్రసూతి సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు, ఆహారపు అలవాట్లను, పాటించాల్సిన వ్యాయామాలను వివరించారు. అలాగే చిన్నపిల్లల మరణాల రేటును పరిశీలిస్తే ఎక్కువ శాతం 28 రోజుల లోపు వయస్సు గల శిశువుల మరణాలే ఎక్కువగా ఉన్నాయని కాబట్టి ఆ సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్, ఫిట్ సెక్రెటరీ సిహెచ్.సాగర్, ఏఐటీయూసీ ఫిట్ సెక్రెటరీ కె.సౌజన్య, ఏజిఎం (సివిల్) సీహెచ్.రామకృష్ణ, డిజిఎం (పర్సనల్) బి.శివ కేశవరావు, డిజిఎం (ఐఈడి) ఎన్.యోహన్, ఎస్ఓఎం ఎన్విరాన్మెంట్ తోట సత్యనారాయణ, ఇన్చార్జి పర్చేస్ బి.మాధవ్, ఇన్చార్జి క్వాలిటీ మదన్మోహన్, ఏరియా ఎస్టేట్స్ ఆఫీసర్ బి.తౌరియా జిఎం ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.