సమతుల ఆహారంతోనే గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యం
సమతుల్యమైన ఆహారం తీసుకున్నప్పుడే బాలింతలు, గర్భిణులు, చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారని బూర్గంపహాడ్ మండలంలోని కృష్ణసాగర్ సర్పంచ్ తాటి వాణి, ఉప సర్పంచ్ మోహన్రావు అన్నారు. శనివారం మండల పరిధిలోని..
బూర్గంపహాడ్, మే 02 : సమతుల్యమైన ఆహారం తీసుకున్నప్పుడే బాలింతలు, గర్భిణులు, చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారని బూర్గంపహాడ్ మండలంలోని కృష్ణసాగర్ సర్పంచ్ తాటి వాణి, ఉప సర్పంచ్ మోహన్రావు అన్నారు. శనివారం మండల పరిధిలోని కృష్ణసాగర్ పంచాయతీ ఎస్టీ కాలనీ, బత్తులనగర్లో రెండు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి అక్కడ చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు టీహెన్ఆర్ కార్యక్రమంలో భాగంగా తినుబండారాలు, పాలు, కోడిగుడ్లు, బాలామృతం ప్యాకెట్లు, బియ్యం, నూనె తదితర వాటిని అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకుని ఆరోగ్యాన్ని పదిలం చేసుకోవాలన్నారు. కిశోర బాలికలు, మూడేళ్ల చిన్నారులు బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే రక్తహీనత లేకుండా ఉంటుందన్నారు. అనంతరం పశువుల షెడ్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు బొర్రా జ్యోతి, గుండమళ్ల పుల్లమ్మ, పాలకవర్గ సభ్యులు కుర్సం రేవతి, కుంజా రజిత, బాదావత్ సురేష్, గుండి వెంకటేశ్వర్లు, ఆశావర్కర్లు, బాలింతలు, గర్భిణులు, చిన్నారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

