– కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ధర్నా
కొత్తగూడెం గణేష్ టెంపుల్, సెప్టెంబర్ 03 : జీవో నంబర్ 76 ను అమలు చేసి కొత్తగూడెం పట్టణ ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 76 ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొత్తగూడెం పట్టణ ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు రామారావు ప్రాంత ప్రజలకు పొజిషన్ సర్టిఫికెట్ అందజేయాలని కోరారు. అబద్ధపు హామీలతో అధికారులకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తిగా వస్తున్నప్పటికీ ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. పాలన చేతగాని రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేసేదాకా వదిలిపెట్టేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్, కార్పొరేటర్ మల్హోత్రాసాగర్ నాయకులు రుక్మాంగదర్ బండారి, ఏమునూరు శివకృష్ణ, మాదాసు పద్మ, సునీత, హుస్సేన్, వేణు పాల్గొన్నారు.