తుంగతుర్తి, అక్టోబర్ 01 : ప్రముఖ కాంట్రాక్టర్ సంకినేని కృష్ణారావు సతీమణి హేమలత జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర జనరల్ గురుకుల పాఠశాలకు రూ.20 వేల విలువ గల 10 ఫ్యాన్లను వారి మనవడు సంకినేని మన్వై మన్వి చేతుల మీదుగా అందించడం జరిగింది. దాతల చేయూత హర్షణీయమని సర్పంచ్ మల్లెపక సాయిబాబు, పాఠశాల ప్రిన్సిపాల్ సతీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఉప సర్పంచ్ శ్రీనివాస్, బిజెపి మండల అధ్యక్షుడు నారాయణ, దాసు నాగరాజు, గాజుల మహేందర్, వార్డు మెంబర్లు బొజ్జ యాదగిరి, నరేష్, నరసింహ, రాంబాబు, నవీన్, సందీప్ పాల్గొన్నారు.