రామవరం, నవంబర్ 26 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవరాం జీఎం కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేశారు. అనంతరం ఎస్ ఓ టు జీఎం కోటిరెడ్డికి మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం కార్మిక హక్కుల కోసం పోరాటాలు చేసే ట్రేడ్ యూనియన్ లని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని దుయ్యబట్టారు.
కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థను మెల్లగా ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్తుందన్నారు. కార్మికులను 12 గంటలు పని చేయిస్తూ శ్రమ దోపిడి చేస్తూ, బడా పెట్టుబడిదారులను పెంచి పోషిస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ కార్మిక 29 చట్టాలను నాలుగు కోడులుగా విభజించి కార్మిక హక్కులను కాల రాస్తుందని మండిపడ్డారు. ఈ కోడ్ ల విధానాన్ని రద్దు చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. నాలుగు కోడ్లను వెంటనే రద్దు చేయకపోతే నిర్వధిక సమ్మెకు సైతం వెనుకాడబోమని సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జునరావు, టీబీజీకేఎస్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ రజాక్, సీఐటీయూ సెక్రటరీ విజయగిరి శ్రీనివాస్, జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు వీరస్వామి, గడప రాజయ్య, సందబోయిన శ్రీనివాస్, ఏం ఆర్ కే ప్రసాద్, సాయి పవన్, సాంబమూర్తి, కమల్, మధు కృష్ణ, గుమ్మడి వీరయ్య, బుటీక రాజేశ్వర్రావు, విజయగిరి శ్రీనివాస్, చిలుక రాజయ్య, గోపు కుమార్ స్వామి, ఎండీ సత్తార్ పాషా, సీహెచ్ సాగర్, మోహన్ రెడ్డి, నటరాజ్, మల్లికార్జున్ రావు, సకినాల సమ్మయ్య, పోశం శ్రీనివాస్, కొమరయ్య, కాసార్ల సమ్మయ్య, సాంబమూర్తి, బాలు, కొప్పుల కుమార్, సలిగంటి తిరుపతి, సత్యనారాయణ, గడప రాజయ్య, వెంకటేశ్వర్లు, తాతిదారులు పాల్గొన్నారు.

Ramavaram : నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని జీఎం కార్యాలయ ముట్టడి