– ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ అభిలాష
రుద్రంపూర్, మార్చి 31 : తన సేవా కాలమంతా నిజాయితీ, క్రమశిక్షణతో పనిచేసి గౌస్ అందరికీ ఆదర్శంగా నిలిచారని ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ అభిలాష అన్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా ఎస్అండ్ పీసీ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇన్స్పెక్టర్గా పనిచేసి పదవీ విరమణ పొందిన గౌస్‌ను మంగళవారం ఘనంగా సన్మానించారు. మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఫంక్షన్ కమిటీ, టెంపుల్ కమిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఓ అభిలాష మాట్లాడుతూ.. గౌస్‌తో కలిసి పనిచేసిన అనుభవం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఉద్యోగ జీవితంలో ఆయన చూపిన నిబద్ధత అందరికీ మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు. పలువురు సహచరులు కూడా గౌస్ ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ జే.రాంబాబు, జూనియర్ ఇన్స్పెక్టర్ కామరాజు, జమేదార్లు కమల్ సింగ్, జయరాజు, వై.శ్రీనివాస్, సీనియర్ గార్డ్స్ ఆర్.హనోక్ రాజ్, జనార్దన్ రావు, మల్లికార్జున్, సుధాకర్, గౌస్, వి.సురేశ్, ప్రైవేట్ సెక్యూరిటీ సూపర్వైజర్లు సుంకరి శ్రీనివాస్, ఈశ్వర్, నూకరాజు, తోటి గార్డ్స్, డ్రైవర్లు, బంధుమిత్రులు పాల్గొన్నారు. చివరిగా అందరూ కలిసి గౌస్ భవిష్యత్ జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.