రామవరం, ఆగస్టు 14 : ఎక్కడ వేసిన చెత్త అక్కడే.. ఏరియాలో పారిశుధ్య నిర్వహణ లేమి అనే శిర్షికతో నమస్తే తెలంగాణ ఆన్లైన్ వెబ్‌లో బుధవారం ప్రచురితమైన కథనానికి సింగరేణి కొత్తగూడెం ఏరియా సివిల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు స్పందించారు. గురువారం ఉదయమే ఏరియాలో ఎక్కడెక్కడ చెత్త పేరుకుపోయిందో, ఆ వివరాలను ప్రైవేట్ సూపర్వైజర్ల ద్వారా తెలుసుకుని సివిక్ ఉద్యోగుల ద్వారా ఏరియాలో చెత్తను తొలగించారు. దీంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. అధికారుల పర్యవేక్షణ నిత్యం ఇలాగే కొనసాగితే ఏరియా మొత్తం పరిశుభ్రంగా ఉంటుందని కార్మికులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Ramavaram : స్పందించారు.. చెత్తను తొలగించారు