రామవరం, డిసెంబర్ 31 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ ఉప సర్పంచ్ తోట సంతోష్ కుమార్ సహకారంతో రుద్రంపూర్ గ్రామంలోని ముస్లింల స్మశానవాటిక (ఖబ్రస్తాన్) పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను బుధవారం జెసిబి సహాయంతో తొలగించి శుభ్రపరిచారు. ఖబ్రస్తాన్ పరిశుభ్రంగా ఉండేలా ముందడుగు వేసిన ఉప సర్పంచ్‌కు అక్కడి ముస్లింలు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో ప్రజల అవసరాలను గుర్తించి స్పందించిన ఉప సర్పంచ్ చర్యను స్థానికులు అభినందించారు.

Ramavaram : రుద్రంపూర్ ఖబ్రస్తాన్లో చెత్త తొలగింపు