రామవరం, జులై 02 : కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.వీరాస్వామి అన్నారు. ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ జీకేఓసి, ఏరియా స్టోర్స్ కార్మికులను, కొత్తగూడెం ఏరియాలోని జీకేఓసి, ఏరియా స్టోర్స్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్స్ నిర్వహించారు. సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ రజాక్, సీఐటీయూ బ్రాంచ్ కార్యదర్శి విజయగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి కార్మిక హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు.
కొత్తగూడెం ఏరియాలోని అన్ని సంఘాల నాయకులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఏరియా స్టోర్స్ పిట్ కార్యదర్శి కమల్, జీకేఓసి పిట్ కార్యదర్శి ఎం ఆర్ కే ప్రసాద్, ఏఐటీయూసీ సీనియర్ నాయకులు, బ్రాంచ్ సహాయ కార్యదర్శి, గట్టయ్య, సాంబమర్తి, శేషగిరిరావు, సందబోయిన శ్రీనివాస్, హీరాలాల్, కోటి, రవి, వింజపురి వినయ్, ప్రసాద్, దండ శ్రీనివాస్, సాగర్, సురేశ్, సుబ్రమణ్యం, వెంకటేశ్వర్లు, అవినాశ్, లిఖిత్, దీక్షిత్, నాగరాజు, రాజేశ్, మొయినుద్దీన్, కుసన నరేందర్, వేముల నరేశ్, నాగేశ్వర్రావు పాల్గొన్నారు.