టేకులపల్లి, డిసెంబర్ 23: టేకులపల్లి మండల కేంద్రంలో సర్పంచ్‌లుగా గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థులను మాజీ ఎమ్మెల్యే హరిప్రియనాయక్ సన్మానించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలకు గురి చేసిన ప్రజలు తమవైపే నిలబడ్డారని హరిప్రియ నాయక్ అన్నారు. టేకులపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ సర్పంచ్‌లకు మంగళవారం సన్మానం చేశారు. గొల్యతండా, సులానగర్ ఇండిపెండెంట్‌గా గెలిచిన 3,4 వార్డు సభ్యులను ఆమె గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ…. అధికార పార్టీ బెదిరింపులు, ఒత్తిళ్లకు తలొగ్గకుండా పార్టీ గెలుపుకోసం కృషి చేసిని గులాబీ కార్యకర్తలను ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ నేతలు చాలా చోట్ల దాడులకు దిగారు. సులానగర్‌లో పదిమంది ఎస్సీ సోదరులను అనేక ఇబ్బందులకు గురి చేశారు. అయినా సరే 250 మెజార్టీతో గెలిపించారు. బోడా బాలునాయక్‌ను రాత్రిపగలు తేడా లేకుండా స్టేషన్లకు తిప్పించారు. నిర్బంధాలకు గురి చేసినా 660పై మెజారీతో మండల కేంద్రంలో బీఆర్ఎస్ను భారీ మెజారీటితో ప్రజలు గెలిపించారు అని హరి ప్రియనాయక్ వెల్లడించారు.
బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేస్తే ఇందిరమ్మ ఇండ్లు, పథకాలు అందవని బెదిరించారని, కాంగ్రెస్ నేతలు ఎన్ని చేసినా మండలంలో బీఆర్ఎస్ ఓటింగ్ శాతన్ని తగ్గించలేక పోయారని ఆమె పేర్కొన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ కదనరంగంలోకి దిగారని, కాంగ్రెస్ నాయకులకు చెమటలు పడుతున్నాయని హరిప్రియా నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ నాయకులు భూక్య దళ్‌సింగ్ నాయక్, పీఎసీఎస్ మాజీ చైర్మన్, మాజీ జట్పీటీసి లక్కినేని సురేందర్‌రావు, టేకులపల్లి మండల అధ్యక్షులు బొమ్మెర్ల వరప్రసాద్, టేకులపల్లి సర్పంచ్, ప్రధాన కార్యదర్శి బోడ బాలు నాయక్, బానోత్ రామానాయక్. బానోత్ కిషన్ నాయక్, మహిళ నాయకురాలు ఆమెడ రేణుక, బుర్రి వెంకటేశ్, కోరం కుమార్ స్వామి, కక్కెర్ల సురేష్, నాగేందర్ పాల్గొన్నారు.