ఇల్లందు, మే 19 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణం జగదాంబ సెంటర్లో గల ఆదిత్య ఫెర్టిలైజర్స్ షాప్ షార్ట్ సర్క్యూట్తో గత రాత్రి పూర్తిగా దగ్ధమైంది. రోజు మాదిరే యాజమాని ఆదివారం సాయంత్రం దుకాణానికి తాళాలు వేసి వెళ్లాడు. రాత్రి 12 గంటల సమయంలో మంటలు రావడంతో చుట్టుపక్కల వాళ్లు గమనించి ఫైర్ స్టేషన్కి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది వచ్చేలోపు దుకాణంలోని పురుగుల మందులు, యూరియా బస్తాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.2.46 కోట్ల నష్టం వాటిల్లినట్లు షాపు యజమాని నాగేశ్వరరావు తెలిపారు.