‘పెంచిన ఎరువులు, డీజిల్, పెట్రోల్ ధరలు తక్షణమే తగ్గించాలి’
అఖిల భారత కిసాన్ సభ ఇచ్చిన పిలుపులో భాగంగా పెంచిన ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని తాసీల్దార్ వద్ద సీపీఐ అనుబంధ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం నాయకులు ధర్నా నిర్వహించారు.
బూర్గంపహాడ్, జూన్ 22 : అఖిల భారత కిసాన్ సభ ఇచ్చిన పిలుపులో భాగంగా పెంచిన ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని తాసీల్దార్ వద్ద సీపీఐ అనుబంధ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు సిద్దపు సుబ్బారెడ్డి, సీపీఐ మండల కార్యదర్శి సబ్కా నాగేశ్వరరావు, పేరాల శ్రీనివాసరావు, అలవాల సీతారామిరెడ్డి మాట్లాడుతూ కేంద్రం పెంచిన ధరలను తక్షణమే ఉప సంహరించుకోవాలని, రైతులు పండించిన ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేసే బాధ్యత కేంద్రమే వహించాలని డిమాండ్ చేశారు. యూరియా యాప్‌ను రద్దుచేసి రైతు భరోసా మొత్తంగా ఒకే దఫాలో జూన్ 30లోగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని, ఈ విషయాన్ని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించి పంటల ఖర్చుకు ఉపయోగపడేలా అమలుచేయాలన్నారు.
నకిలీ విత్తనాలు, పురుగు మందులను విక్రయించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి శిక్షించాలని, పంటల రుణమాఫీ రూ.2 లక్షలకు పైగా చేయాలని, పంటల బీమా పథకాన్ని రూపొందించి అమలుచేయాలని, రైతులు పండించే ధాన్యానికి బోనస్ ఇవ్వాలని, గ్రామాల్లో వ్యవసాయ అధికారులు విస్తృతంగా పర్యటించి ఏ విత్తనాలు వేయాలి… ఏ సమయంలో ఏ పంట వేయాలో పూర్తిస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ కేఆర్కే ప్రసాద్‌కు నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు బర్ల వెంకటేశ్వర్లు, వీవీబీ చారి, దాసరి మల్సూర్, లోకిరెడ్డి శంకర్‌రెడ్డి, తోకల శ్రీను, కుంజా నాగరాజు, పుల్లయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కువైట్ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

