లక్ష్మీదేవిపల్లి, సెప్టెంబర్ 08 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని మార్కెట్ యార్డ్ యూరియా పంపిణీ కేంద్రం వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరిపడా యూరియాను సరఫరా చేయక అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. యూరియా కోసం ప్రతిరోజు కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుందని, యూరియా వస్తుందో లేదో.. ఇస్తారో ఇయ్యరో కూడా తెలియని స్థితిలో ఉన్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల గోసను ప్రభుత్వం అర్థం చేసుకుని సరిపడా యూరియా పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు.
Laxmidevipally : లక్ష్మీదేవిపల్లిలో యూరియా కోసం రైతుల తిప్పలు
Laxmidevipally : లక్ష్మీదేవిపల్లిలో యూరియా కోసం రైతుల తిప్పలు