ఇల్లెందు, ఆగస్టు 14 : ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న పీఏసీఎస్ ఎరువుల గోదాం వద్దకు భారీ ఎత్తున యూరియా కోసం వచ్చిన రైతులు యూరియా లేదనడంతో న్యూ డెమోక్రసీ నాయకులతో కలిసి ప్రధాన రహదారిపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సరిపడా యూరియా అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.