చండ్రుగొండ, మే 3: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Kothagudem) చండ్రుగొండ మండల కేంద్రంలో గల వ్యవసాయ మార్కెట్ గోదాంలో వరి రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. క్వింటాలకు తరుగు కోసం మిల్లర్లు 5 నుంచి 7 కిలోలు డిమాండ్ చేయడంపై రైతుల అసంతృప్తి వ్యక్తం చేశారు. మిల్లర్లు సివిల్ సప్లయ్ అధికారులు కుమ్మక్కై రైతులను దోపిడి చూపిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ గోడౌన్ లోనే రైతులకు న్యాయం జరగకపోతే ఎలా అని ప్రశ్నించారు.
రైతులు కష్టపడి ఎండనక వాననక స్పందించిన వరి ధాన్యాన్ని తరుగు పేరుతో మిల్లర్లు దోపిడీ చేస్తున్న జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. మిల్లర్ల దోపిడీ వెనుక జిల్లా అధికారులు ప్రభుత్వ పెద్దల హస్త ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అన్నారు. జిల్లా అధికారులు ఎందుకు రైతుల ధాన్యాన్ని దించుకోవడంలేదని మిల్లర్లను ప్రశ్నించడం లేదని కనీసం తనిఖీలు సైతం చేయడం లేదని దీనిపై రైతుల అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. మిల్లర్ల దోపిడీ ఆగే వరకు రైతులు పరంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.